Breaking News
Home / SLIDER / హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్‌!

హైదరాబాద్‌లో ఈనెల 19న ఆటోలు, క్యాబ్‌లు బంద్‌!

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్‌, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను 714 తీసుకొచ్చి ఫిట్‌నెస్‌ రెన్యువల్‌ రోజుకు రూ.50 పెనాల్టీ వేయడంపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బంద్‌కు ఆటోలు, క్యాబ్‌లు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆరోజు సామాన్య ప్రజల జీవనానికి అసౌకర్యం కలగనుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino