బండ్ల గణేష్ సినీ నిర్మాత, నటుడు. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెల్లడించే ఆయన.. శనివారం చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. జీవితంలో ఎవర్నీ నమ్మొద్దంటూ బండ్ల గణేష్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని మినహా జీవితంలో ఎవర్నీ నమొద్దని.. మనల్ని మనం మాత్రమే నమ్ముకుందామని పేర్కొన్నారు.
మనపై కోటి ఆశలతో వాళ్లు జీవిస్తుంటారని.. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని ఇద్దామన్నారు. కొన్నింటిపై ఇష్టాలు పెంచుకుని మన అనుకునే వాళ్లకి అన్యాయం చేయొద్దని వ్యాఖ్యానించారు. అసలు బండ్ల గణేష్ ఉన్నట్టుండి ఇలాంటి ట్వీట్ ఎందుకు చేశారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.