ప్రముఖ నటుడు, సీనియర్ హీరో కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. భారీ వసూళ్లతో కమల్ కెరీర్లోనే ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం 16 రోజుల్లోనే ఈస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. దీనిలో సగం ఒక్క తమిళనాడు నుంచే వచ్చాయి. మరిన్ని రికార్డులనూ ఈ సినిమా బద్దలుకొట్టనుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన ‘విక్రమ్’ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,, సూర్య తదితర ప్రముఖ నటులు నటించారు.