హీరో రామ్ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌కు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. దీనిలో విజిల్ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్ ఇచ్చిన రామ్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు.
ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయా. నా వారియర్ డైరెక్టర్ లింగుస్వామి. ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఫ్రేమ్‌ని మీరు మీ భుజాలపై ఎత్తుకున్నారు. ఇప్పటివరకు నేను పనిచేసిన బెస్ట్ డైరెక్టర్స్‌లో మీరు ఒకరుగా ఉన్నందుకు థ్యాంక్స్ సారీ అండ్ లవ్ యూ అని ట్వీట్ చేశారు రామ్. రామ్ చేసిన ట్వీట్‌కు స్పందించిన లింగుస్వామి.. నాతో కలిసి పనిచేయడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు బాగా తెలుసు.
ఈ సినిమా చూసిన తర్వాత ఆనందంతో నువ్వు నన్ను హగ్ చేసుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోనని, మనం కలిసి ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామ్ నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో సిద్ధమవుతోంది. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తుంది. వచ్చే నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.