Home / MOVIES / ఆ సీనియర్ కమెడియన్‌కు అమీర్‌ఖాన్ ఎవరో తెలీదంటా..!

ఆ సీనియర్ కమెడియన్‌కు అమీర్‌ఖాన్ ఎవరో తెలీదంటా..!

ఆయనో ఫేమస్ కమెడియన్.. 40 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అదే రంగానికి చెందిన ఓ స్టార్‌హీరో ఎవరో తనకు తెలీదట.. తాజాగా ఆ నటుడు మీడియాతో ముచ్చటించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. స్టార్‌ హీరోలు, తోటి నటులు, నటులు గురించి తెలియకపోతే ఇండస్ట్రీలో ఉండడం దేనికో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకూ ఇలాంటి కామెంట్స్‌ చేసిన ఆ నటుడు ఎవరో తెలుసా..

సీనియర్‌ యాక్టర్‌ అన్నూ కపూర్.. మిస్టర్‌ ఇండియా, తేజాబ్‌, ఉత్సవ్, హమ్, డర్ వంటి పలు బాలీవుడ్‌ సినిమాల్లో సహాయనటుడు, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన కీలకపాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ క్రాష్‌ కోర్స్‌ ఓటీటీలో విడుదలైంది. దీనికి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన అమీర్‌ఖాన్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అమీర్‌ఖాన్‌ సినిమా గురించి ప్రశ్నించగా.. నేను నా సినిమాలతో సహా ఏ మూవీలు చూడను.. నిజం చెప్పాలి అంటే మీరు ఆడుగుతున్న ఆ అమీర్‌ఖాన్‌ ఎవరో నాకు తెలీదు.. తెలియని వ్యక్తి సినిమాల కోసం అడిగితే నేనెలా మాట్లాడగలను అని సమాధానమిచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సినిమాలు చూడవు.. స్టార్‌హీరో ఎవరో తెలీదు అంటున్నావు.. అలాంటప్పుడు సినీపరిశ్రమలో నీవు ఉండాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri