Home / SLIDER / చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజెక్షన్‌ ఎన్ని రూ.కోట్లో తెలుసా..?

చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజెక్షన్‌ ఎన్ని రూ.కోట్లో తెలుసా..?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఓ దంపతుల 23 నెలల చిన్నారికి ఓ అరుదైన వ్యాధి సోకగా దాతల సాయంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ను ఫ్రీగా అందించింది ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నోవార్టిన్‌ ఫార్మా కార్పొరేట్. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌ చిన్నారికి చికిత్స జరిగింది.

రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల నెలల పాపకు స్పైనల్‌ మస్కులర్ అట్రోపీ-2(ఎస్‌ఎమ్‌ఏ) వ్యాధి సోకింది. దీనివల్ల బ్రెయిన్ కండరాలు క్షీణిస్తాయి. చిన్నారులు నడవలేకపోవడం, ఆహారం మింగలేకపోవడం, పడుకొని లేవలేకపోవడం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. దీని నుంచి చిన్నారులను రక్షించేందుకు జోల్‌జెన్‌స్మా అనే ఇంజక్షన్‌ ఉపయోగిస్తారు. అమెరికా, స్విట్జర్లాండ్‌లో మాత్రమే ఇది లభిస్తుంది. టాక్స్‌తో కలిపి దీని ఖరీదు రూ.22 కోట్లు. కాగా దీనిపై ఉన్న ఎక్సైజ్‌ సుంకం, జీఎస్టీ రూ.6 కోట్లను కేంద్రం ఎత్తేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino