Site icon Dharuvu

సిటీలో ఆ 2 గంటలు ఆర్టీసీలో ఫ్రీగా తిరగొచ్చు..

స్వతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల్లో భాగంగా తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్‌లో వైద్యానికి వచ్చిన వారికి తిరిగి ఇంటికి వెళ్లడానికి కల్పించిన ఉచిత ప్రయాణ ఫెసిలిటీని కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఈ అవకాశం ఎవరికీ, ఎంత టైం వరకు అంటే..

హెల్త్ బాగోలేక హాస్పిటల్‌కి వెళ్తే.. అక్కడ డాక్టర్లను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీలో ప్రయాణించవచ్చు. ఇందుకు వైద్యులు మందుల చిట్టీపై రాసిన టైమ్‌ను కండక్టర్‌కు చూపిస్తే చాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడివరకైనా ఇలా ఉచితంగా వెళ్లొచ్చని తెలిపారు రంగారెడ్డి ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సామ్యూల్.

దూర ప్రాంతాల నుంచి నగరానికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంజీబీఎస్‌తో పాటు సిటీలో ఎక్కడ దిగినా తర్వాత 2 గంటలు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

Exit mobile version