పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.
కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో నాగ్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అక్టోబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు మహేశ్‌బాబుతో ది ఘోస్ట్ ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్న చిత్రబృందం లైగర్ సినిమా విరామ సమయంలో ది ఘోస్ట్ ట్రైలర్‌ను ప్లే చేశారు. ఇందులో నాగార్జున లుక్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. వింటేజ్ నాగ్ని చూసినట్లు ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.