Home / BUSINESS / మార్కెట్లో ఐపోన్ 14 మోడల్స్.. ఫీచర్స్ అదుర్స్..!

మార్కెట్లో ఐపోన్ 14 మోడల్స్.. ఫీచర్స్ అదుర్స్..!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం ఐఫోన్ 14 మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇవే కాకండా వాచ్‌ సిరీస్ 8, ఎయిర్‌పాడ్స్ ప్రో, వాచ్‌ ఎస్ఈ2లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫీచర్స్

– ఐఫోన్ 14లో 6.1 ఇంచ్ ఓఎల్‌ఈడీ స్క్రీన్, ఐఫోన్ 14 ప్లస్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది.
– బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్, స్టార్‌లైట్, మిడ్ నైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటాయి.
– వీటిలో బ్యాటరీ ఐఫోన్ చరిత్రలోనే టాప్ అని కంపెనీ వెల్లడించింది.
– ఏ15 బయోనిక్ చిప్, 12 మెగాపిక్సెల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాస్.
– ఐఫోన్ 14 స్టార్టింగ్ కాస్ట్ రూ.79,900
– ఐఫోన్ 14 ప్లస్ ధర 89,900
ఐఫోన్ 14 సెప్టెంబరు 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబరు 7న మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి.

ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఫీచర్స్

– ఐఫోన్ 14లో 6.1 ఇంచ్ స్క్రీన్, 14 ప్రో మ్యాక్స్‌లో 6.7 ఇంచ్ స్క్రీన్
– ఏ 16 బయోనిక్ చిప్
– న్యూ పర్పుల్‌ కలర్
– 48 మెగాపిక్సెల్‌ కెమెరా
– డైనమిక్‌ ఐలాండ్‌
– ఐఫోన్‌ 14 ప్రో స్టార్టింగ్ ప్రైజ్ రూ.1,29,900
– 14 ప్రో మ్యాక్స్‌ ధర రూ.1,39,900
ఈ రెండు మోడల్స్ సెప్టెంబరు 16 నుంచి లభించనున్నాయి.

వాచ్ సిరీస్‌ 8

కొత్త డిజైన్‌తో అధునాతన సెన్సార్లు, టెక్నాలజీతో ఈ వాచీని తీసుకొచ్చారు. వినియోగదారు తీవ్రమైన కారు ప్రమాదంలో చిక్కుకుంటే గుర్తించే క్రాష్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఇందులో ఉంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ దీని ప్రత్యేకత. తక్కువ పవర్‌ మోడ్‌లో 36 గంటలు పనిచేస్తుంది.
ఈ వాచీ ధర 399 డాలర్లు. సెల్యులార్‌ ఎడిషన్‌ కోసం 499 డాలర్లు చెల్లించాలి. సెప్టెంబరు 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

వాచీ ఎస్‌ఈ2

– కొత్త ఎస్‌ఈ2 మిడ్‌నైట్‌, సిల్వర్‌, స్టార్‌లైట్‌ కలర్స్‌లో లభించనుంది.
– క్రాష్‌ డిటెక్షన్‌, ఫాల్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.
– ప్రారంభ ధర 249 డాలర్లు, జీపీఎస్‌+సెల్యులార్‌తో కలిపి ధర 299 డాలర్లు.

వాచీ అల్ట్రా

– క్రాష్‌ డిటెక్షన్‌, కంపాస్‌, డెప్త్‌ గేజ్‌, నైట్‌ మోడ్‌ ఫీచర్లు ఉన్నాయి.
– కాస్ట్‌ రూ.89,900
– సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌పాడ్స్‌ ప్రో

– కొత్త హెచ్‌2 చిప్‌ కలిగిన ఈ హెడ్‌ఫోన్స్‌ 30 గంటల పాటు పనిచేస్తుంది.
– 5 వేరియేషన్లలో లభించనుంది.
– సెకెండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్‌ ప్రో కాస్ట్ 249 డాలర్లు
– 23 నుంచి అందుబాటులోకి రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat