Home / MOVIES / కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ

కడసారి చూసేందుకు కదిలివస్తోన్న ఇండస్ట్రీ

ప్రముఖ సినీ నటుడు కృష్ణం రాజు మృతితో ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. ఆయన భౌతికకాయం స్వస్థలానికి చేరుకోవడంతో కృష్ణం రాజును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. కృష్ణం రాజు మృత దేహాన్ని చూసిన ఆయన సతీమణి శ్యామలా దేవి కన్నీరుమున్నీరయ్యారు. సినీ ప్రముఖులు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్, త్రివిక్రమ్, మహేశ్‌బాబు, డైరెక్టర్ రాఘవేంద్రరావు, రాజు సుందరం, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నాని, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Image

Image

సినీ నటుడు కృష్ణంరాజు మరణం తీవ్ర విచారకరం. ఆయన నటన, సృజనాత్మకతను, సినీ పరిశ్రమకు అందించిన సేవలను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయి. రాజకీయ నాయకుడిగానూ ఆయన సేవలు ఆదర్శం, స్ఫూర్తిమంతం. ఆయన కుటుంబానికి ప్రగాఢ అనుభూతి తెలియజేస్తున్నా
– ప్రధాని నరేంద్రమోదీ

తెలుగు సినిమా దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు గారు మనల్ని విడిచి పెట్టారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. ఆయన మరణం చిత్రసీమకు తీవ్రలోటు మిగిల్చింది. ఓం శాంతి.
– కేంద్ర మంత్రి అమిత్ షా

Image

మా అన్నయ్య.. మొగల్తూరి బిడ్డ. కృష్ణంరాజు లేరనే మాట. జీర్ణించుకోలేకపోతున్నా. ఇటీవల ఆయన ఆరోగ్యం గురించి నేనూ ఆరా తీశా. ఇలా జరగడం చాలా విచారకరం. ‘చిలకా గోరింక’ చేసినప్పుడు మొగల్తూరు వస్తే, ఆయన్ను చూడటానికి ఎగబడిన వాళ్లలో నేనూ ఉన్నా. ఆయన బయటకు వచ్చి, చేయి ఊపితే ‘హీరో అంటే ఇలా ఉండాలి’ అనిపించింది. ఆ దృశ్యం నేటికీ నా కళ్ల ముందు కదలాడుతుంది. ‘మన ఊరి పాండవులు’ చేస్తున్నప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. కృష్ణంరాజు ఒక మహావృక్షంలాంటివారు. అలాంటి వృక్షం ఈ రోజు కూలిపోయింది.
– చిరంజీవి

Image

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన ఆయన తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. కృష్ణంరాజు కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను
– పవన్‌కల్యాణ్‌

కృష్ణంరాజు మృతిపట్ల సీనియర్‌ నటుడు కృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Image

మురళీమోహన్‌

Image

కె.రాఘవేంద్రరావు

ప్రభాస్‌ను పరామర్శిస్తున్న కొరియోగ్రాఫర్‌ రాజు సుందరం

త్రివిక్రమ్‌

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri