Home / POLITICS / హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్

హిందీ కూడా అన్నింటిలా ఓ అధికారిక భాష మాత్రమే: కేటీఆర్

హిందీ భాష కూడా అన్ని భాషల్లా ఓ అధికారిక భాష మాత్రమే అని జాతీయ భాష కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీతో పాటు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా హిందీలోనే ఇస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఇలా చేయడం వల్ల ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

చాలా అధికారిక భాషల్లానే హిందీ కూడా కేవలం ఓ అధికారిక భాషే అని కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు నేషనల్ లాంగ్వేజ్ అని ఏదీ లేదని అయన స్పష్టం చేశారు. తమకు ఇష్టమైన భాషను ఎంచుకునే హక్కు భారత ప్రజలకు ఉండాలని ఆయన తెలిపారు. ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో హీందీ లాంగ్వేజ్‌ను తప్పనిసరి చేయడం సరికాదని అభిప్రాయపడ్డ కేటీఆర్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat