రోజు రోజుకు కామాంధులు చిన్నాపెద్దా తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. వారి కామానికి పసిపిల్లల్ని సైతం వదలడం లేదు. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ కన్ను పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలుగా చిన్నారిపై జుగుప్సాకరమైన రీతిలో లైంగిక దాడి చేస్తున్నాడు. పాప రోజు రోజుకు నీరసంగా తయారవ్వడంతో అనుమానంతో తల్లి బుజ్జగించి విషయం తెలుసుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు స్కూల్‌కి వెళ్లి డ్రైవర్‌ను చావబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నపాప ఎల్కేజీ చదువుతోంది. కొన్ని రోజులుగా పాప యాక్టివ్‌గా ఉండడం లేదు. రోజు రోజుకు నీరసంగా మారుతోంది. స్కూల్ నుంచి వస్తూ ప్రతి రోజూ ఏడుస్తోంది. తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్లడం ఇష్టం లేక ఏడుస్తోందని మొదట్లో అనుకున్నారు. సోమవారం కూడా పాప ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆమె తీరుపై అనుమానంతో తల్లి బుజ్జగిస్తూ విషయం తెలుసుకొని షాక్ అయ్యింది. స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ రజినీకుమార్ పసిపాప అని చూడకుండా రెండు నెలలుగా చిన్నారిపై లైంగిక దాడి చేస్తున్నాడు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్కూల్‌కి వెళ్లి డ్రైవర్‌ను చితక్కొట్టారు. అనంతరం ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఓ టైంలో ప్రిన్సిపల్ మీద దాడికి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రజినీకుమార్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.