Home / JOBS / నిరుద్యోగ యువతకు శుభవార్త

నిరుద్యోగ యువతకు శుభవార్త

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్‌ సర్కిల్‌లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 1422
ఇందులో రెగ్యులర్ ఖాళీలు 1400, బ్యాక్‌లాగ్‌ పోస్టులు 22 ఉన్నాయి.
వీటిలో నార్తీస్ట్‌ సర్కిల్‌లో అత్యధికంగా 300 పోస్టులు ఉండగా, భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, కోల్‌కతా సర్కిళ్లలో 175 చొప్పున, జైపూర్, మహారాష్ట్ర సర్కిళ్లలో 200 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 1992, అక్టోబర్‌ 1 నుంచి 2001, సెప్టెంబర్‌ 30 మధ్య జన్మించినవారై ఉండాలి. అంటే అభ్యర్థులకు 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్‌ ఫీజు: రూ.750

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 7
కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: నవంబర్‌ నెలలో
ఆన్‌లైన్‌ పరీక్ష: 2022, డిసెంబర్‌ 4
వెబ్‌సైట్‌: www.sbi.co.in

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino