ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సూరత్‌లోని స్వామి నారాయణ్ ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి శతాబ్ది మహోత్సవం జరుగుతుంది. దీంతో పాటు కార్తికమాసం ప్రారంభం కావడంతో భక్తులు వందలాదిగా స్వామివారికి ప్రత్యేకమైన రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. వీటిలో చాలా వెరైటీల పిండివంటలు, ఐస్‌క్రీమ్‌లు ఉన్నాయి. భక్తలు సమర్పించిన వంటకాలను గర్భగుడిలో స్వామివారి ఎదుట ప్రసాదాల మధ్య దేవతామూర్తల విగ్రహాలు కళకళలాడుతున్నాయి.
