Home / MOVIES / సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!

సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!

సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్‌ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న సామ్ వారితో పోరాడటం ఈ నేపథ్యంలో సమంత ఎదుర్కొన్న కష్టాలు ట్రైలర్‌లో చూపించారు. ప్రెగ్నెంసీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్‌ చెప్పడం అందుకు పూర్తి భిన్నంగా సమంత జీవితంలో జరగడం.. తదితర సన్నివేశాలు మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. అసలు సరోగసీకి సమంతకు సంబంధం ఏంటి? సమంత ఎందుకు సరోగసీ పద్ధతిలో తల్లైంది? అసలక్కడ సరోగసీ పేరుతో ఏం జరుగుతోంది తదితర విషయాలు సినిమాలో చూడాల్సిందే.

నవంబరు 11న యశోద మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. హరి, హరీశ్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat