ప్రముఖ హీరో ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్, హాజరవుతారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో పాటు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్కు ఆహ్వానాలు అందాయి.
గత ఏడాది పునీత్‌రాజ్‌కుమార్ హఠాన్మరణం చెందారు. సినీ రంగంతో పాటు సామాజిక సేవా రంగంలో ఆయన విశేషంగా సేవలు అందించారు. ఈ నేపథ్యంలో పునీత్‌కు అవార్డు ఇవ్వనున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్‌కు విశేషమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల తర్వాత అక్కడ చాలా మంది ఫ్యాన్స్ తారక్‌కి ఉన్నారు. పునీత్ రాజ్‌కుమార్‌తో ఎన్టీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ తల్లి షాలిని పుట్టిన ప్రాంతం కూడా కర్ణాటకలోనే ఉండటం గమనార్హం.