అతడో ప్రముఖ కంపెనీ సీఎఫ్ఓ. ఎంతో హుందాగా నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆయన ఫుల్లుగా తాగి మద్యం మత్తులో చేసిన పనికి అందరూ నోరెళ్ల బెట్టారు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
తనతో ఏమాత్రం పరిచయం లేని ఓ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె బెడ్ మీద దూరి బట్టలు విప్పి మరీ పడుకున్నాడు సీఎఫ్‌ఓ. ఆయన ఇంట్లో దూరిన సమయానికి ఇంట్లో లేని యువతి కాసేపు అయ్యాక ఇంటికి చేరుకుంది. అనంతరం ఎవరో వ్యక్తి తన ఇంట్లో ఉండడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అమెరికాలోని అర్కాన్సస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలోని ఫేమస్ ఫుడ్ కంపెనీ టైసన్ ఫుడ్స్. ఈ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ టైసన్ (32) తప్పతాగాడు. అనంతరం ఓ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి దుస్తులు తీసేసి బెడ్‌పై పడుకున్నాడు. ఆ టైంలో ఇంట్లో ఆ అమ్మాయి లేదు. ఆమె తిరిగి వచ్చి చూసే సరికి తన బెడ్‌పై ఎవరో ఉన్నారని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వచ్చి అతడి డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా టైసన్‌ను గుర్తించారు. అనంతరం పోలీసులు జాన్ టైసన్‌ను నిద్రలేపేందుకు ఎంత ప్రయత్నించినా అతడు మద్యం మత్తు నుంచి లేవలేదు. దీంతో జాన్ టైసన్‌పై కేసు నమోదు చేసి వాషింగ్‌టన్ కౌంటీలోని డిటెన్షన్ సెంటర్‌కు అతడిని తరలించారు. అక్కడ అతడి వద్దనుంచి 415 డాలర్లు తీసుకొని విడిచిపెట్టారు. ఇక వచ్చేనెల 1న టైసన్ కోర్టులో హాజరుకానున్నాడు.
ప్రస్తుతం టైసన్ ఫుడ్స్ ఛైర్మన్ జాన్ హెచ్ కొడుకే ఈ జాన్ టైసన్. అయితే ఆ కంపెనీ ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.