తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్‌మెంట్ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు మంత్రి కేటీఆర్… ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు సూచించారు.
Request Minister @SabithaindraTRS Garu to kindly intervene and address the issue
As per the request of the students, girls hostel was built and handed over to the college. This situation seems unwarranted https://t.co/HddjVl8KG0
— KTR (@KTRTRS) November 8, 2022