ఉత్తరప్రదేశ్లోని రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి మూడేళ్లు పూర్తయింది. ఆయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అనంతరం సుప్రీం కోర్టు ఆ స్థలం మొత్తం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది.
ఆ వివాదాస్పద భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించే బాధ్యతను ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి అద్భుతమైన రాముడి ఆలయాన్ని నిర్మిస్తోంది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు. ప్రస్తుతం అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రామమందిరం పూర్తి అవుతుందని తెలిపింది ట్రస్టు. మరోవైపు ఈ నిర్మాణ పనులను ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలిస్తున్నారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్య రామాలయం నిర్మాణ క్రతువు మొదలైందని.. త్వరలో పూర్తవుతోందని తెలిపారు.