Home / CRIME / సహజీవనం చేసి.. 35 ముక్కలు కోసి.. 18 రోజులుగా..!

సహజీవనం చేసి.. 35 ముక్కలు కోసి.. 18 రోజులుగా..!

దేశ రాజధాని దిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇన్నాళ్లూ సహజీవనం చేసి తీరా ఆమె పెళ్లి చేసుకోమని అడిగిందని అక్కసుతో నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా మృత దేహాన్ని 35 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో ఉంచి.. 18 రోజులు దిల్లీ పరిసర ప్రాంతాల్లో విసిరాడు.

శ్రద్ధా, ఆఫ్తాబ్ అమీన్ పునావాలా ప్రేమించుకున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. శ్రద్ధా ముంబయిలోని ఓ ఫేమస్ కాల్ సెంటర్‌లో పనిచేస్తుంది. వీరి విషయం ఇంట్లో తెలిసి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ముంబయి నుంచి దిల్లీ పారిపోయారు. అక్కడ మెహ్రౌలీలో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. పెళ్లి కాకుండా కలిసి ఉన్నామని, పెళ్లి చేసుకుందామని శ్రద్ధా తన ప్రియుడిని అడిగింది. ఈ విషయమై వారిద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతూనే ఉండేది. ఒక రోజు గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో అమీన్ శ్రద్దాను హత్య చేసి చంపేశాడు. తర్వాత ప్రియురాలి హత్య ఎవరికీ తెలీకుండా ఉండేందుకు ఆమె మృత దేహాన్ని 35 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో ఉంచేశాడు. అనంతరం 18 రోజుల పాటు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో ఆ ముక్కలను విసిరేశాడు. ఇలా ఆమె మృత దేహాన్ని కనిపించకుండా చేశాడు.

అనుమానంతో అసలు విషయం తెలిసింది..

శ్రద్ధాకు ఆమె కుటుంబ సభ్యులు చాలా సార్లు ఫోన్ చేశారు. ఎంతకీ ఆమె ఎత్తకపోవడంతో వారిలో అనుమానం ప్రారంభమైంది. నవంబరు 8న శ్రద్ధా తండ్రి దిల్లీలో వారు ఉంటోన్న ఫ్లాట్‌కు వచ్చారు. కానీ ఫ్లాట్‌కు తాళం వేసి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అమీన్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. పదే పదే పెళ్లి చేసుకోమని విసిగించిందని అందుకే ఆమెను హతమార్చినట్లు నిందితుడు అంగీకరించాడు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar