Home / POLITICS / Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ కు ప్రశ్నల వర్షం కురిపించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటలు పేల్చుతున్నారు. కాగా ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు చేయడం ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది. దీంతో పవన్‌ పై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు వరుసగా పవన్ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఈ తరుణం లోనే జనసేన, టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ కు అంబటి రాంబాబు తనదైన శైలిలో పలు ప్రశ్నలు సంధించారు.

ఈ మేరకు ఆయన మీడియా తో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… భీమవరంలో మళ్లీ పోటీ చేస్తారా లేదా, మళ్లీ గాజువాకలో పోటీ చేస్తారా, 25 సీట్ల కన్నా ఎక్కువ చోట్ల పోటీ చేస్తారా ? లేక ఎవరితో కలిసి పోటీ చేస్తారో చెప్పు అంటూ అంబటి ప్రశ్నించారు. రాజకీయాల్లో పెద్ద జోకర్‌ పవన్‌ అని అంబటి వ్యాఖ్యానించారు. జనసేన రౌడీసేనే అని వంద సార్లు అంటాం అని… పవన్‌ తో ఎవరైనా కలిసి వెళితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడమే అని తెలిపారు. ప్రస్తుతం ఈ మాటల యుద్దం ఇక్కడితో ఆగేలా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat