Political ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది. ఈ మేరకు సిబిఐ అధికారులు కవితను ఏడు గంటల పాటు విచారించి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ పూర్తయింది.. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ లో ఉన్న ఆమె ఇంట్లో సిబిఐ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు.. 11 గంటలకు మొదలైన ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగింది.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సాక్షిగా కవిత నుంచి.. సీబీఐ అధికారులు పలు కీలక వివరాలు సేకరించారు.. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్ కు చేరుకున్నట్టు సమాచారం.. అయితే విచారణ ఏ విధంగా జరిగిందనేది కేసీఆర్ కు వివరించినట్టు సమాచారం.. కాగా ఈ కేసు విచారణ పై కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యాయవాదులతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం
కాగా సీబీఐ డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలో విచారణ జరిగింది. విచారణ అనంతరం కవిత ప్రగతి భవన్‌కి బయలుదేరనున్నట్లు సమాచారం.మొత్తం రెండు వాహనాల్లో ఆరుగురు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. ఈ బృందంలో ఒక మహిళా సీబీఐ అధికారి కూడా ఉన్నారు. స్టేట్ మెంట్ రికార్డు అనంతరం.. సీబీఐ అధికారులు సాయంత్రం కవిత ఇంటినుంచి వెళ్లిపోయారు.. అయితే ఈ విచారణలో ఆమె నుండి పలుకేలకు సమాచారం సేకరించారని మనిషి సిసోడియా పాత్రను గురించి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది..