Political ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగెత్తిపోయారని అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారని అన్నారు.. అలాగే ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 90 శాతం మందికి సంక్షేమ పథకాలు అందేలా చేసిన ఘనత జగన్ దే అని అన్నారు.. ఈ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్ని వర్గాల వారికి ఈ ఉపాధి హామీ పథకాలతో సంక్షేమ పథకాలతో న్యాయం చేకూరేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అన్నారు..
అలాగే ‘రాజకీయ నేత ఎలా ఉండకూడదో చెప్పేందుకు చంద్రబాబే ఉదాహరణ. ఎల్లో మీడియా చంద్రబాబుకు ఎంత సహకరిస్తుందని దీని ద్వారా వైసిపి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. . వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో పెద్ద ఎత్తున కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను కూడా విస్తరించారు. వ్యాధులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ సర్కారు కృషి చేస్తోంది’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.