Home / POLITICS / KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
good new for govt employees telangana SARKAR hike da/dr

KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం డీఏ/ డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం 2.73 శాతం పెంచుతూ నిర్ణయించారు. తాజా పెంపుతో.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ/డీఆర్ 20.02 శాతానికి పెరిగింది. పెరిగిన మొత్తాన్ని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

ఇదే విషయాన్ని పేర్కొంటూ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. డీఏ/డీఆర్ పెంపునకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను పోస్టు చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat