Home / POLITICS / KTR: ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Minister KTR started the industry of ITC products

KTR: ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తెలంగాణ గురించి ఐటీసీ ఛైర్మన్ మాట్లాడిన మాటలుసంతోషం కలిగించాయన్నారు.

ఐటీసీ అతిపెద్ద పేపర్‌ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే తెలంగాణ ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. మిగులు విద్యుత్ ను సాధించడమే కాక….. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు.

68 లక్షల టన్నుల నుంచి నేడు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి రైతులు ఎదిగారని గుర్తు చేశారు. నీళ్లు ఇస్తే అద్భుతాలు సృష్టించగలమని రైతులు నిరూపించారని కొనియాడారు.

ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విదేశాల నుంచి నూనెల దిగుమతిని తగ్గించడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఐటీసీకి ఆసక్తి ఉంటే తెలంగాణలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమ పెట్టాలని మంత్రి సూచించారు.

ములుగు జిల్లా కమలాపురంలో రేయాన్స్‌ ఫ్యాక్టరీని టేకప్‌ చేయాలని కోరారు. పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు….మనం ఎంత మంచి సహకారం అందిస్తే….. మరింత విస్తృతంగా పెట్టుబడులు పెడతారని అన్నారు. దీనికి ప్రజలు సహకారం అందించాలన్నారు.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat