suryanarayana: చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తే ఇలా ప్రవర్తిస్తే……ప్రజలు వీళ్లను చూసి ఏం నేర్చుకోవాలని ప్రశ్నించారు. నిన్న అనపర్తిలో పోలీసులపై దౌర్జన్యానికి దిగడం దారుణమని అన్నారు.
ఎంత గూండాయిజం ప్రదర్శించినా ఏం చేయలేని అన్నారు. తెదేపా నేతల చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలే చంద్రబాబుకు సరైన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. ఎదుటివాడి మీద దాడి, అసత్య ప్రచారాలు చేయడం తప్ప మరోకటి చంద్రబాబుకు తెలియదని అన్నారు. 2 వేల కూడా పట్టని చోట సభ పెట్టాలని అనుకున్నారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
చంద్రబాబు పక్కన అవినీతి పరులు ఉన్నారని అందరికీ తెలుసని తెలిపారు. అనపర్తిలో ఇప్పటి వరకూ కులాల ప్రస్తావన లేదు….ఈరోజు కొత్తగా చంద్రబాబు కులాల ప్రస్తావన తీసుకురావడం విడ్డూరంగా ఉందని అన్నారు. అనపర్తి….రెండో పులివెందుల అని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలవాలని చంద్రబాబుకు….ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు.
చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ విచిత్రంగా ఉంటాయని విమర్శించారు. ప్రతి తప్పుకు జగన్ నే నిందించడమేంటని ప్రశ్నించారు. ఏం చేయాలో తెలియక….ఇలా పిచ్చిపిచ్చి మాటలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే….రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు ఎంత ఆస్తి ఉందో సీబీఐ ముందు నిరూపించాలని డిమాండ్ చేశారు. అంతేగానీ చేతకాని మాటలెందుకని ప్రశ్నించారు.