Himachal Pradesh Politics హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తాజాగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ఈడి, సి బి ఐ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయంటూ విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజకీయ ప్రత్యర్థులపై ఈడి, సి బి ఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని మండిపడ్డారు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుకువేందర్ సింగ్.. ప్రస్తుతం ఈ సంస్థలు అడ్మినిస్ట్రేటివ్ సంస్థలు కాదని రాజకీయ సాధనాలుగా మారిపోయాయని అన్నారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవటం ఎంతవరకు సరైన పద్ధతి అంటే ప్రశ్నించారు.
అలాగే ఈ సందర్భంగా మాట్లాడిన సుఖ్వీందర్ సింగ్ ఎన్నికల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఏజెన్సీలను వాడుకుంటుందని అన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇవి ఈడి సిబిఐ లు తమ సోదాలను నిర్వహిస్తుందని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం విరుచుకు పడటం ఎంతవరకు సరైన పద్ధతి అని చెప్పుకొచ్చారు.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై కాషాయ పాలకులు దాడులు చేస్తున్నారని అన్నారు. తమను ఎదిరించే వారిని దేశద్రోహులుగా ముద్రించడం ఎంతవరకు సరైన పద్ధతిని ప్రశ్నించారు..
తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐ సోదరులు నిర్వహించేటట్టు కేంద్రం ఉసిగొలుపుతుందని ఇది అసలు సరైన పద్ధతి కాదంటూ చెప్పవచ్చారు. అలాగే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇదే పద్ధతి కొనసాగిందని ముందు ముందు కూడా ఇదే జరుగుతుందని చెప్పుకొచ్చారు.