Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి అడుగులో సీఎం జగన్ మహిళలకు అండగా ఉన్నారని ప్రతి ఇంటిలో మహిళలకు ప్రాధాన్యత పెరగడానికి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తున్నారని తెలిపారు.. రాష్ట్రంలో ఉన్న మహిళలకు అన్న రంగాల్లో మేలు జరుగుతుంది కాబట్టే వారంతా చాలా ఆనందంగా ఉన్నారని ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎంతో దయతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
అలాగే అన్న మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి సీఎం జగన్ అంటూ చెప్పుకొచ్చిన మంత్రి రజిని.. మహిళలు సొంతంగా తమ తమ నిలబడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇందుకోసమే పలు రకాల కార్యక్రమాలతో పాటు మహిళలకు ఎన్నో రకాలుగా చేయుట అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే పలు కార్యక్రమాలు చేపట్టి సంక్షేమం పథకాల ద్వారా మహిళల అభ్యున్నతికి సహాయపడుతున్నామని ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తించి తమ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవలని తెలిపారు. వైయస్సార్ చేయూత కాపు నేస్తం కార్యక్రమాలు ఇందులో భాగమే అంటూ గుర్తు చేశారు.