Site icon Dharuvu

Minister Ktr : చెత్త ఎత్తుతున్న బాలుడి ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. ఆలోచింప చేస్తున్న ట్వీట్..

Minister Ktr తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. ఆయన రాష్ట్ర బాగోగుల కోసం దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలను మరియు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టేందుకు ఇస్తున్నటువంటి రాయితీలను వారికి తెలియజేసి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడిలను తీసుకు వచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి కుటుంబాలలో సంతోషాన్ని నింపుతున్నారు.

బిఅర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ప్రజలకు రాష్ట్రానికి దేశానికి మంచి జరిగే విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ట్విట్టర్లో షేర్ చేసుకున్న ఒక ఫోటో ట్యాగ్ లైన్ ప్రస్తుతం ప్రజలందరినీ ఆలోచింపచేస్తున్నాయి. తాజాగా కేటీఆర్ ట్విట్టర్లో చెత్తను ఎత్తుతున్న ఒక బాలుడు ఫోటో షేర్ చేసి ‘సంథింగ్ టు థింక్ అబౌట్’ అని ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ ఒక విజ్ఞప్తిని చేశారు. దయచేసి చెత్తను ఎవరు రోడ్ల పైన వేయవద్దు. డస్ట్ బిన్ లో వేయండి. మీరు రోడ్లపైన చెత్తను వేస్తే దానిని తీసివేసేందుకు ఒక పర్సన్ కావాలి అందుకే ప్రజలందరూ చెత్తను డస్ట్ బిన్ లోనే వేసి శుభ్రతను పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. చెత్తను రోడ్ల పైన వేయడం వలన పిల్లల యొక్క భవిష్యత్తు పాడవుతుందని అందువల్ల ప్రజలందరూ ఆలోచించి ఈ విషయంపై మంచిగా నడుచుకోవాలని ఆయన చేసినటువంటి సూచనలు ప్రస్తుతం అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.

Exit mobile version