Ys Jagan జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలకు సంక్షేమ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ముందు కొనసాగుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చేయుత, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు వంటివి పేదల జీవితాల్లో ఎంతో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తనపై తన ప్రభుత్వం పై ఎటువంటి అవినీతి మచ్చలు లేకుండా ఎంతో నైపుణ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు.
తాజాగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు గత ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కీం పెట్టి దేశంలోనే అతిపెద్ద స్కాన్ చేసిందని ఆయన ఆరోపించారు సిమెంట్ అనే ఒక ప్రైవేటు సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నరని ఈ ఒప్పందం మొత్తం విలువ 3371 కోట్ల రూపాయలని అందులో 90% ప్రభుత్వం అందజేస్తుందని అప్పట్లో ప్రచారం చేశారు. ఒక ప్రైవేటు సంస్థ 90% నిధులు అంటే 3000 కోట్ల రూపాయలు ఎక్కడైనా అందజేస్తుందా అది వట్టి అబద్ధమని.. కానీ దానిని అప్పట్లో చంద్రబాబు నాయుడు అతని యొక్క మీడియా గట్టిగా ప్రచారం చేసిందని.. కానీ అందులో నిజం లేదని చెప్పారు.. కేవలం అప్పట్లో మూడు నెలల్లోని 371 కోట్ల రూపాయలు ఐదు విడుదల ప్రభుత్వం సొమ్ము విడుదల చేసిందని కానీ ఆ సొమ్ము మరల చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిందని ఆయన ఈరోజు అసెంబ్లీలో చెప్పారు. ఈ విధంగా చూస్తే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి ఎంతో స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది.