Breaking News
Home / SLIDER / బిజెపి, కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక…

బిజెపి, కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్, న్యూ షాపూర్ నగర్ లకు చెందిన బిజెపి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దళిత సంఘాల ఐక్య వేదిక మహిళా వింగ్ అధ్యక్షురాలు ఎం.అరుణ గారి ఆధ్వర్యంలో 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ సీఎం కేసీఆర్ గారి దార్శనిక పాలనలో ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, సమ్మయ్య, ఇందిరా రెడ్డి, సిద్దిక్, శహనాజ్ బేగం, మెహెరున్నిస బేగం, రెహ్మాన్, సత్యనారాయణ, ఇస్మాయిల్, గణేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino