Home / ANDHRAPRADESH / చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చిన సీఎం జగన్
ap cm jagan counters to chandrababu and pawan kalyan

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అదిరిపోయే కౌంటర్లు ఇచ్చిన సీఎం జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ కు అదిరిపోయే రీతిలో వరుస కౌంటర్లు ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే అని.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుందని మండిపడ్డారు.

2016 లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్‌ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి అంటూ కామెంట్స్ చేశారు. అదే విధంగా అమలాపురంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్‌ జమ చేశారు. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు.

ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారు. చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరగదు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందు కోసమే చంద్రబాబు అధికారం ఇవ్వాలట అంటూ ఫైర్ అయ్యారు.

పుంగనూరు ఘటన చేస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక​ రూట్‌లో పర్మిషన్‌ తీసుకుని ఇంకో రూట్‌లో వెళ్లాడు. 47 మంది పోలీసులకు గాయాలు చేశాడు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీసు కన్ను పోగొట్టాడు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారు. మీ బిడ్డకు మీరే ధైర్యం. మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని మాట్లాడారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat