కడప నడిబొడ్డున స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ లు వేస్తూ సందడి చేసింది. బుట్ట బొమ్మ రాకతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు పూజా హెగ్డే వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. . ఈ సందర్భంగా తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేసి మరీ అభిమానులను అలరించింది పూజా హెగ్డే. అందాల బుట్టబొమ్మ డ్యాన్సులతో యువకుల కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, 13 వ డివిజన్ కార్పొరేటర్ ఎం. రామలక్ష్మణ్ రెడ్డిలు విశిష్ట అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ..కడప ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలను మరిచిపోలేనన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..వరలక్ష్మీ వ్రతం పండుగ రోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభం కావడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది, స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. పూజా హెగ్డే రాకతో పోటెత్తిన అభిమానులను అదుపులోకి పెట్టడానికి పోలీసులు నానా శ్రమపడాల్సి వచ్చింది.