తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నియోజకవర్గ కేంద్రమైన ఖమ్మం నగరంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(SDF) నిధులు రూ .1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.నగరంలోని 13వ డివిజన్ శ్రీనగర్ కాలనీ రోడ్ నెం.1 లో రూ.90 లక్షలు, 9వ డివిజన్ ఇందిరా నగర్ నందు కల్వర్టు లతో కూడిన 2.5కిలో మీటర్ల మేర సీసీ డ్రైన్ కు రూ.90లక్షలు మొత్తం రూ.1.80కోట్లతో నిర్మించనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరం శరవేగంగా విస్తరించింది.. అందుకు కారణం BRS ప్రభుత్వమే.గడచిన 20 ఏళ్లలో ఏ నాడూ ఇంత అభివృద్ది జరగలేదు.. ఒకప్పుడు చిన్న చిన్న గల్లిలు, చిన్న చిన్న దారులుగా ఉండేవి.కానీ నేడు ఇదే నగరం అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టడం జరిగింది.. కనీస వసతులు లేని స్థితి నుండి నేడు సకల వసతులతో సకల సౌకర్యాలతో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక వసతులు కల్పించాం..ఇక్కడ వివక్ష చూపకుండా ఖమ్మం నగరం నా ఇల్లు అనుకుని, ఇక్కడ ప్రజలు నా కుటుంబ సభ్యులు అని భావించి అన్ని వసతులు కల్పించాం.
ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఇచ్చిన SDF నిధులు రూ.50 కోట్లతో నగరంలో నేడు దాదాపు 1500 కిలో మీటర్ల మేర సైడ్ కాల్వలు నిర్మిస్తున్నాం. గతంలో ఒక్కో డివిజన్ కు రూ.45 లక్షలు ఇచ్చాం.ప్రజా రవాణా మెరుగు పరిచేందుకు టేకులపల్లి వద్ద నూతన బ్రిడ్జి కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపాము, త్వరలోనే నూతన బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేయనున్నాం.హైద్రాబాద్ తరువాత రెండవ స్థానంలో ఖమ్మం ఉంటుంది.. ఆ స్థాయికి మనం చేరుకున్నాం.ఖమ్మం నగరం అద్భుతంగా అభివృద్ది జరుగుతుంది, దాన్ని అడ్డుకోవడానికి అనేక మంది వస్తారు.. కేవలం ఓట్ల కోసం, స్వార్థం కోసం వస్తారు.. వాళ్ళను పట్టించుకోవద్దు..మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి, మనమే ఉండాలి అప్పుడే అభివృద్ది కొనసాగుతుంది..
దీనికి బ్రేక్ లు వేయకండి.. కొనసాగించాలి.. BRS ను గెలిపించాలని.కేసీఅర్ గారు ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. తెలంగాణ ప్రభుత్వంలో మనం ఉండాలా వద్దా అని మీరే విజ్ఞతతో ఆలోచించాలి.. చాలా మంది వస్తారు అనేక విద్యలు ప్రదర్శిస్తారు.. వాటికి లోంగాల్సిన అవసరం లేదు.నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే.. BRS కు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్న. ఇప్పటి కంటే ఇంకా చాలా అభివృద్ధిని చూస్తారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, జాన్ భీ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్, డిఈ ధరణి, నాయకులు వల్లభనేని రామారావు, నాగుల్ మీరా, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, పగడాల నాగరాజు తదితరులు ఉన్నారు.