బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థినులకు వింత అనుభవం కలిగింది. తమ స్కూల్‌లో జరిగిన ఓ వేడుకకు ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ హర్‌జోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు విలువచేసే శానిటరీ నాప్‌కిన్స్ ఉచితంగా ఇవ్వాలని కోరారు.
దీనికి స్పందించిన హర్‌జోత్ కౌర్.. కోరికలకు అంతు అనేదే ఉండదని.. ఈరోజు శానిటరీ నాప్‌కిన్స్ ఫ్రీగా అడుగుతున్నారు. ఇప్పుడు ఛాన్స్ ఇస్తే రేపటి రోజున కండోమ్స్ కూడా ఉచితంగా అడుగుతారు అని సమాధానం చెప్పారు. ఓ మహిళ పైగా ఐఏఎస్ అధికారిణి ఇలా రియాక్ట్ అయ్యేసరికి అక్కడున్న అమ్మాయిలు బిత్తరపోయారు. ఆమె ఇలా అనడంతో విద్యార్థినులు కూడా తగ్గకుండా ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎక్కడలేని హామీలన్నీ ఇస్తారు కదా అని నిలదీయగా.. హర్‌జోత్ కౌర్ స్పందిస్తూ అయితే ఓట్ల వేయడం మానేయండి.. పాకిస్థాన్‌లా మారిపోండి అని విద్యార్థినులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.