Home / SLIDER / రాజీనామా లేఖ ఇవ్వడానికి భయపడుతున్నారా..?

రాజీనామా లేఖ ఇవ్వడానికి భయపడుతున్నారా..?

ఇదిగో రాజీనామా చేసిన అంటూ హంగామా చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ నిజంగానే ఇచ్చిండా? అంటే ఏమో అంటున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలు. సోషల్ మీడియాలోనైతే అగో.. ఇగో అంటూ రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ ప్రచారంలోకి కూడా వచ్చిన విషయమూ తెలిసిందే. 16 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడికి వచ్చి స్పీకర్‌కు రాజీనామా సమర్పించవచ్చు. ఒకవేళ ఆయన లేఖ ఇచ్చినట్లయితే నిబంధనల ప్రకారం దాన్ని స్పీకర్ సభలోనే చదివేవారు.

రాజీనామా ఆమోదంపై కూడా శాసనసభ వేదికగానే ప్రకటన వచ్చేది. ఎన్నికల సంఘానికి కూడా స్పీకర్ నివేదిక పంపించేవారు. ఇప్పటివరకు ఇదేదీ జరగలేదు. కానీ, తానేదో రాజీనామా చేసినట్లు రేవంత్‌రెడ్డి బయట ప్రచారం చేసుకుంటున్నారు. పైగా తనకు జీతం వద్దని, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్లలో(ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లలో) కేటాయించిన 807 క్వార్టర్‌ను ఖాళీ చేస్తానని, గన్‌మెన్లను కూడా వెనక్కు ఇచ్చేస్తానంటూ శాసనసభ స్పీకర్‌కు లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మొత్తంగా రేవంత్‌రెడ్డి ఎన్ని డాంబికాలకు పోయినా తోకముడిచినట్టేనని తెలుగుదేశం నేతలే అంటున్నారు.రాజీనామా లేఖపై తొందరపడి ప్రకటన చేశానని రేవంత్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. ఏదో ఒకవిధంగా వచ్చే ఎన్నికల వరకు శాసనసభకు వెళ్లకుండా నడిపించుకుందామని, రాజకీయంగా ఎవరైనా ప్రశ్నించకుండా ఉండేందుకు జీతం వద్దని లేఖ రాసేస్తే పనైపోతుందన్న భావనతో లేఖ రాసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తానంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.

అందుకే ఆయన అసెంబ్లీ జరుగుతున్నా ఏనాడూ రాజీనామా వ్యవహారంపై స్పీకర్‌ను కలువలేదు, కనీసం లేఖ కూడా పంపలేదు. ఇక మీదట కూడా రాజీనామా లేఖను ఇచ్చే అవకాశంలేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat