MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపును ప్రతిపక్షాలు ఆపలేవని అన్నారు. మేధావులైన గ్యాడ్యుయేట్లు ఆలోచించిన ఓటేయాలని మంత్రి కోరారు. వైకాపా అభ్యర్థి గెలుపే మా ప్రాధాన్యత అంతేతప్ప మరొకటి లేదని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. మా అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ను తప్పకుండా గెలిపిస్తామని మంత్రి పునరుద్ఘాటించారు. ఆరోపణలు ఎంత మంది చేస్తారని అన్నారు. శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేయడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా ఏం పెట్టారంటూ మండిపడ్డారు.
దానికి కూడా వైకాపా హిందువులను కించపరించిందని భాజపా నేతలు అనడం విడ్డూరంగా ఉందో అని మంత్రి అన్నారు. భాజపా చేష్టలు చూస్తుంటే…..ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు ఏం చెప్తారో మేం అదే చేస్తామని మంత్రి వ్యాఖ్యానించారు. భాజపా నేతల వ్యాఖ్యలను మేమంతా ఏకకంఠంతో ఖండిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
భాజపాకు రాష్ట్రంలో అవకాశాలు లేవు. ఏం చేయాలో తెలీక పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. భాజపాకు ఆరోపణలు తప్ప మరో ధ్యాస లేదని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మా నాయకుడికి చిత్తశుద్ధి ఉంది. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసని అన్నారు.