వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 18వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి ఆయన ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఉదయం 8 గంటలకు రామకృష్ణాపురం నుంచి ప్రారంభమై ఎర్రగుడి చేరుకుంటారు. ఈ యాత్రలో వైఎస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. ఈ విరామం అనంతరం ఎర్రగుడి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గం గోరంట్ల చేరుకున్న తర్వాత బీసీ సంఘాలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వెంకటగిరికి చేరుకుంటారు.రాత్రి 7.30 గంటలకు వెంకటగిరిలోనే వైఎస్ జగన్ బస చేస్తారు.
