ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి దక్షిణకొరియాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా 6 ద్వైపాక్షిక సమావేశాలు, 2 గ్రూపు సమావేశాల్లో పాల్గొంటారని, అలాగే 2 ఎంవోయూలు, 2 రోడ్ షోలు, బిజినెస్ సెమినార్లకు హాజరవుతారని తెలిపారు.
