కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.
