ఇవాళ ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా టీడీపీ అధినేత,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.
Wishing you a happy birthday @YSJagan. May God bless you with a happy and healthy life.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2017
దేవుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ ‘ఆశ్చర్యం అండీ… మీకు ధన్యవాదాలు’ అని జగన్ ట్వీట్ చేశారు. జగన్ చేసిన ట్వీట్ ను తన అభిమానులు అందరూ లైక్ చేస్తున్నారు.
Pleasant surprise andi. Thank you. https://t.co/OA1Rxylcff
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 21, 2017