అనంతపురం జిల్లాలో ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 44వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. జగన్ తన 44వ రోజు పాదయాత్రను కదిరి మండలం గాండ్లపెంట నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్కమాను, గాజులవారిపల్లె, చామలగొంది క్రాస్, ధనియాని చెరువు, డి.కొత్తపల్లి, కొట్టాలవారిపేట, బండారుచెట్లుపల్లి మీదుగా వంకమద్ది క్రాస్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్ జగన్ మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
