ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు 44 మందికి టీటీడీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు పనిచేయకూడదా? పనిచేయవచ్చా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి వివరణ కోరనుంది టీటీడీ. ఇటీవల టీటీడీ డిప్యూటీ ఈవో స్నేహలత దేవస్థానానికి చెందిన వాహనంలో చర్చికి వెళ్లడం వివాదాస్పదమయింది. దీంతో టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారు 44 మంది ఉన్నట్లు టీటీడీ గుర్తించింది. వీరు 1989 నుంచి 2007 వరకూ ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. వీరికి రేపు గాని ఎల్లుండి గాని నోటీసులు జారీ చేసే అవకాశముంది.