అవును, నిజమే.. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నా కూడా.. ఆ మంత్రిగారి చూపు మాత్రం వైఎస్ జగన్‌వైపే లాగుతోంది. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్‌పై పెరుగుతున్న ప్రజా ఆదరణో లేక పలు మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయ ఫలితాల కారణమో తెలీదు కానీ.. వైఎస్ జగన్ చెంత చేరేందుకు పలు రాజకీయ పార్టీ సీనియర్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఎస్ జగన్ అంటే తనకు, తన మామకు ఎనలేని ఇష్టమని, తన మామ వైఎస్ జగన్‌ను కలిపించాలని తనను ఎప్పుడు అడుగుతుంటాడని, వైఎస్ జగన్ పాదయాత్ర వైజాగ్‌కు చేరుకోగానే తన మామను జగన్‌తో కలిపిస్తానని చెప్పిన మాటలు విధితమే. అంతేగాక… ఇటీవల కాలంలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కూడా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత జగన్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇలా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరిగా మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి పదవి పొందిన మంత్రి ఆదినారాయణరెడ్డి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి ఆదినారాయణ రెడ్డి వైఎస్ జగన్ క్రిస్టియన్ కాదని.. కస్టోడియన్ (custodian) అంటూ మీడియా ముఖంగా చెప్పారు. ఇక్కడ కస్టోడియన్ అంటే సంరక్షకుడని అని అర్థం. మరి మంత్రి ఆది నారాయణరెడ్డి custodian అన్న పదానికి అర్థం తెలిసి అన్నారా..? తెలియక అన్నారా..? లేక ఇటీవల కాలంలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న సర్వేలను అనుసరించి ఈ మాటలు అన్నారా..? అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
మంత్రి ఆది నారాయణరెడ్డి మాటలను విన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అవును వైఎస్ జగన్ నిజంగాన కస్టోడియన్ అంటూ సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజల బాగోగులను కనుక్కుంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే కదా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్‌పై మంత్రి ఆది నారాయణరెడ్డి అన్న ఈ మాటలను విన్న నెటిజన్లు మాత్రం వైసీపీ టిక్కెట్‌పై గెలిచి టీడీపీలో మంత్రి పదవి అనుభవిస్తున్నా కూడా వైఎస్ జగన్‌పై తనకున్న అభిమానాన్ని వీలున్నప్పుడల్లా చాటుకుంటున్నాడని, 2019 ఎన్నికల్లో జగన్ చెంతకు మంత్రి ఆదినారాయణరెడ్డి కన్ఫాం అంటూ చర్చలు మొదలెట్టేశారు.