తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో లేనన్న సోఫియా.. తనకు ఇష్టమైన నటుడు షారూఖ్ ఖాన్ అని తెలిపింది. మనుషుల్లాగే తనకూ రెస్ట్ అవసరమని సోఫియా చెప్పింది. తనకు ఇంకా బ్యాంక్ ఖాతా ను ఇవ్వలేదని తెలిపింది..మానవాళిపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరిక తనకు లేదని.. మనుషులు సృజనాత్మకత కలిగిన వారని, వారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాని చెప్పింది. అంతేకాదు…అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా తెలిపింది.థ్యాంక్యూను మించిన గొప్ప పదం మరొకటి లేదంది.
