కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు భూమా వర్థంతి నాడే ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. అఖిల ప్రియ తన తండ్రి వర్ధంతి సభకు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఎవి సుబ్బారెడ్డిని పిలవకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
See Also:రండి నేను ప్రాణాలర్పిస్తా ..చంద్రబాబు & బ్యాచ్ కు పోసాని సవాలు ..!
ఈ నేపథ్యంలో ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నట్లు ఎవి సుబ్బారెడ్డి తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియకి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో ఆమె అయిష్టంగానే ఏదో మొక్కుబడిగా మాట్లాడి ఆ సమయం కానిచ్చేశారు. ఆ తరువాత మళ్లీ వీరి మధ్య పాత వైరమే కొనసాగుతున్నట్లు కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంతో తేటతెల్లమైపోయింది. ఎవి సుబ్బారెడ్డి హాజరైన ఈ మీటింగ్ కు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ మంత్రి అఖిల ప్రియ హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసినా పరిస్థితిలో ఏ మార్పు లేదు.
See Also:పోసానిలా ప్రతి తెలుగోడు ఆలోచిస్తే కేంద్రం దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుంది..!
అయితే తాజాగా ఏవీ సుబ్బారెడ్డి..ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని వ్యాఖ్యానించిన ఎవి సుబ్బారెడ్డి ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. సిఎం చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబంధాలున్నాయని…తనకు ఏ పదవి ఇవ్వాలో త్వరలో ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని ఎవి సుబ్బారెడ్డి అన్నారు.దీంతో ఎవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆళ్లగడ్డ రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే అఖిల ప్రియ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సిఎం చంద్రబాబు…ఎవి సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపిస్తారా అనే చర్చ జరుగుతోంది. అలా జరిగితే మంత్రి అఖిల ప్రియ ఏం చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైఫు 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచింది కాబట్టి..2019 కూడ వైసీపీ నుండి పోటి చేస్తాదని సమాచారం. ఎందుకంటే అనాడు వైసీపీ నుండి గెలిచి..కారు ప్రమాదంలో మరణించిన శోభా నాగిరెడ్డి చనిపోతే ఆ స్థానంలో చిన్న వయస్సు అయిన అఖిల ప్రియను ఎమ్మెల్యే చేశారు. తరువాత భూమ నాగిరెడ్డిని… అధికారంలో ఉన్నచంద్రబాబు కేసుల అని బయపెట్టి టీడీపీలోకి లాకున్నారు. ఆ ఒత్తిడికి గుండెపోటుతో మరణించారు .అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ నేతలు అఖిలప్రియపై కపట ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారు తప్ప అండగా లేరు. ఇది ఇప్పుడు అఖిల ప్రియకు తెలిసి..ఎలాగో నాకు 2019 లో టిక్కెట్ ఇవ్వరు కనుక..వైఎస్ జగన్ నాకు టిక్కెట్ ఇచ్చిన ఇవ్వకపోయిన వైసీపీలోకి చెరాలని అనుకున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయంగా ఈ నెల 29 న సంచలనం చెలరేగే అవకాశం ఉందంటున్నారు స్థానిక రాజకీయ నేతలు.
See Also:మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానిస్తున్న ఆస్థాన మీడియా-మహిళా సంఘాలు ఎక్కడ ..!