ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.గత కొన్ని రోజుల క్రితమే టీజేఏసీ చైర్మన్ ప్రో. కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో ఒక పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 29న టీజేఎస్ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు టీజేఎస్ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు.అయితే ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయానా సోదరుడైన కాంగ్రెస్ సీనియర్ నేత , ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ జన సమితి పార్టీలో చేరబోతున్నారని గత కొన్ని రోజులుగా ఒక ప్రచారం జరుగుతుంది.రాజగోపాల్‌తో టీజేఎస్ ముఖ్యులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారని..రాజగోపాల్ రాకతో తమ బలం పెరుగుతుందని టీజేఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసిన రాజగోపాల్‌కు ఆ జిల్లాలో మంచి పట్టు ఉందని, అది తమ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఉంటుందని టీజేఎస్ నేతలు భావిస్తున్నారు.అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం పార్టీ మారబోనని, కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతానని స్పష్టం చేస్తున్నారు.
