ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత .అప్పుడు ఉప ఎన్నికల సమయంలో అయిన ..ఉద్యమం సమయంలో అయిన ..కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అయిన ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ గారికి గుర్తు వచ్చే పేరు తెలంగాణ ట్రబుల్ షూటర్ ,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .ఆయన నిత్యం అధికారక అనాదికరక కార్యక్రమాల్లో ఎంత బిజీ గా ఉన్న కానీ సామాన్యుడికి కష్టమొచ్చింది అని తెలిసిన ..ఎవరన్న తన మొబైల్ నెంబర్ కి మెసేజ్ పెట్టిన ఆఖరికి కాల్ చేసిన తను ఎంత బిజీ గా ఉన్న కానీ లిఫ్ట్ చేసి మరి ఎదుటివారు చెప్పే సమస్యలను విని వెంటనే పరిష్కరించి తెలంగాణ ప్రజల మదిని దోచుకున్నారు మంత్రి హరీష్ .
తాజాగా రాష్ట్రంలో మంచి ర్యాల జిల్లా కన్నె పల్లి మండలానికి చెందిన పూసల సుష్మిత గత కొంతకాలంగా ప్రేగులో పుండు కావడంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతవుతుండేది.ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రికి సుష్మితను చేర్పించారు .అయితే ఎక్కడో మంచిర్యాల నుండి రావడానికి సమయం పట్టడంతో అక్కడకి చేరుకునే సరికి ఆదివారం అర్ధరాత్రి అయింది.అప్పటికే ఓపీ సమయం అయిపోవడంతో సోమవారం ఉదయం ఇస్తామని అక్కడి సిబ్బంది చెప్పారు .ఆ తర్వాత ఆమెకు వైద్యం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది .చికిత్స చేయకపోతే కష్టమని తెలిపారు .
అప్పటికే ఆమె నోట్లో నుండి బ్లడ్ పడుతుండటంతో ఏమి చేయాలో పాలు పోక సుష్మీత ను తీసుకొచ్చిన ప్రశాంత్ అనే యువకుడు మంత్రి హరీష్ రావుకు వాట్సాప్ లో మెసేజ్ చేయగా ..మంత్రి హరీష్ రిప్లై ఇస్తూ తన ఓఎస్డీ తో మాట్లాడమని ..అతనికి తప్పకుండ సహాయం చేస్తాడు అని సమాధానమిచ్చాడు.దీంతో సదరు యువకుడు మంత్రి హరీష్ రావు ఓఎస్డీను సంప్రదించగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకురమ్మని తర్వాత అందించాల్సిన చికిత్స అందేలా చేద్దామని చెప్పడంతో సుష్మితాను అక్కడకు చేర్పించారు.ఒక్క వాట్సాప్ మెసేజ్ తో తమ కూతురిను కాపాడిన మంత్రి హరీష్ రావుకు జీవితాంతం రుణపడి ఉంటాం ..దేవుడు లెక్క తమ బిడ్డ ప్రాణాలను కాపాడారు అని మంత్రి హరీష్ రావుపై అభిమానాన్ని చాటుకున్నారు ..