ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల మధ్య ఉన్న తేడా ఏమిటో చెప్పడానికి ప్రత్యేక్ష ఉదాహరణ ఇది .పావలా వంతు పని చేసి రూపాయి వంతు ప్రచారం చేసుకునే చంద్రబాబుకు కుడిచేత్తో చేసిన సాయం గురించి ఎడమచేతికి కూడా తెలియకుండా ఉండాలని నిరూపించిన
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే అని వైసీపీ శ్రేణులు ,వైఎస్సార్ అభిమానులు గర్వంగా చెప్పుకునే సంఘటన ఒకటి జరిగింది .రాష్ట్రంలో మంత్రి పరిటాల సునీత సొంత జిల్లా అయిన అనంతపురం జిల్లాలో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కందుకూరు గ్రామానికి చెందిన అశోక్ ,స్రవంతికు ఇద్దరు కొడుకులు .
వారిలో పెద్ద కొడుకు ఆదిత్యకు చిన్నప్పటి నుండే వినపడదు .అంతే కాకుండా మాటలు కూడా రావు .అలాంటి సమస్యను ఎదుర్కుంటున్న ఆదిత్యకు ఆపరేషన్ చేయడానికి మొత్తం తొమ్మిది లక్షలు అవసరమవుతాయి అని వైద్యులు చెప్పారు .అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు గ్రామాప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీను ఆశ్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది .దీంతో ఏమి చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్న అశోక్ దంపతులకు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కందుకూరు కు చేరుకున్న జగన్ ను కల్సి తమ ఆవేదనను చెప్పుకున్నారు .
అంతే ఉన్నఫలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిత్యను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని తన చిన్నాన్న కొడుకు అయిన వైఎస్ కొండారెడ్డిను ఆదేశించారు .వెంటనే కొండారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో అపోలో ఆస్పత్రిలో చేర్పించి మొత్తం తొమ్మిది లక్షల రూపాయలను చెల్లించి ఆపరేషన్ చేయించారు .ఆపరేషన్ విజయవంతం కావడంతో ప్రస్తుతం మాటలు రావడం కోసం ఫిజియోధెరపీ చేయిస్తున్నారు .అయితే తమకు చేసిన సాయానికి జగన్ కు కృతఙ్ఞతలు చెప్పుకోవడానికి పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు .దీంతో ఈ సంఘటన బయటకు రావడం జరిగింది .అప్పటివరకు ఎవరికీ తెలియని విషయం అందరికి తెల్సిందే .అందుకేనెమో పులి కడుపునా పులే పుడుతుంది అని వైసీపీ శ్రేణులు జగన్ గురించి చెప్పుకుంటారు ..