నల్లగొండ దశ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తారక రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థన మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో నల్లగొండ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి బేటి అయ్యారు. అనంతరం మంత్రి కేటీఅర్ మాట్లాడుతూ నల్లగొండ పట్టనణాబివ్రుద్ది మీద ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన మంత్రి జగదీష్ రెడ్డికి సూచించారు. నల్గొండ పట్టణాన్ని సుందరీకరణకు అవసరమైన నిదులను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. అందులో భాగంగా వందకోట్లు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టణాభివృద్దికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి కేటిఅర్ తెలిపారు. జీఓ నంబర్ 51 అనుసరించి నిధులు విడుదల చెయ్యడంతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ,నియోజకవర్గ ఇంచార్జ్ భూపాల్ రెడ్డి అధికార్లతో కలసి రూపొందించిన ప్రణాళికల మేరకు నిధులు విడుదల చెయ్యడంతో పాటు వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ అప్పటికప్పుడే సంబందిత అధికారులకు ఆదేశాలిచ్చారు. విడుదల చేసిన నిధులతో పార్కుల ఆధునీకరణతో పాటు మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణాలు, కూడలిల అభివృద్ధి, స్మశాన వాటికల మరమ్మతులు చేపాట్టాలని ఆయన చెప్పారు.